Homeటాప్ స్టోరీస్లావణ్య ఆ సినిమా చేసి ఉంటె..ఆమె జతకమే మారిపోయేది

లావణ్య ఆ సినిమా చేసి ఉంటె..ఆమె జతకమే మారిపోయేది

అందాల రాక్షసి మూవీ తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి..త్వరలో మెగా కోడలు కాబోతుంది. వరుణ్ తేజ్ తో ఏడుడగులు వేయబోతుంది. ఇదిలా ఉంటె అమ్మడికి సంబదించిన ఓ వార్త ఆమె అభిమానులను , మెగా అభిమానులను నిరాశకు గురి చేస్తుంది. అదే ఆమె వదులుకున్న మూవీ గురించి.

- Advertisement -

పరుశురాం – విజయ్ దేవరకొండ ల కలయికలో వచ్చిన గీత గోవిందం మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ మూవీ లో హీరోయిన్ గా నటించిన రష్మిక కు మంచి గుర్తింపు వచ్చింది. విజయ్ – రష్మిక ల కలయికలో వచ్చే ప్రతి సీన్ ..యూత్ ను కట్టిపడేశాయి. వాస్తవానికి ఈ మూవీ లో ముందుగా పరుశురాం లావణ్య ను హీరోయిన్ గా అనుకున్నాడట. కానీ సినిమా లో లిప్ లాక్ సన్నివేశం ఉండడం తో లావణ్య నో చెప్పిందట. లావణ్య నో చెప్పడం ..రష్మిక ఓకే చెప్పడం తో ఆమెనే ఫైనల్ చేసాడట పరుశురాం. ఇక సినిమా సూపర్ హిట్ కావడం , రష్మిక కు మంచి గుర్తింపు రావడం తో అమ్మడికి వరుస ఛాన్సులు తలుపు తట్టడం..స్టార్ హీరోయిన్ అవ్వడం జరిగిపోయింది.

ఈ విషయం తెలిసి లావణ్య అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. ఒకవేళ లావణ్య ఈ సినిమా చేసి ఉంటె ఆమె జతకమే మారిపోయి ఉండేదని మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ అమ్మడు త్వరలోనే మెగా ఫ్యామిలీకి కోడలుగా వెళ్లనుంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ రీసెంట్ గా జరిగిన విషయం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All