Homeటాప్ స్టోరీస్నవంబరులో స్టూడెంట్స్‌కు లాప్‌ట్యాప్‌లు

నవంబరులో స్టూడెంట్స్‌కు లాప్‌ట్యాప్‌లు

నవంబరులో స్టూడెంట్స్‌కు లాప్‌ట్యాప్‌లు
నవంబరులో స్టూడెంట్స్‌కు లాప్‌ట్యాప్‌లు

నవంబరులో స్టూడెంట్స్‌కు లాప్‌ట్యాప్‌లు ఇవ్వడంతో పాటు మిని స్టేడియం, మినీ ఐటీ హబ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులకు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. మోడర్న్ క్లాస్‌ రూములను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడమే కాకుండా.. కాలేజీ ప్రాంగణంలో కొత్త మౌలిక వసతులు కల్పించే బాధ్యత తీసుకుంటాన్నారు. క్యాంపస్‌లో మరిన్ని కొత్త కోర్సులను తీసుకొస్తామన్నారు. ఆరు నెలలకు ఒకసారి ట్రిపుల్ ఐటీకి వస్తామని.. ఇక్కడి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థులంతా కలిసి వచ్చి మోడల్ క్యాంపస్‌లా మారేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అమెరికాలోని ఎంఐటీలాగా బాసర ట్రిపుల్ ఐటీ తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

కొత్త మెస్‌లో విద్యార్థులతో లంచ్ చేసిన తర్వాత మంత్రి కేటీఆర్ వారితో ముచ్చటించారు. ట్రిపుల్ ఐటీలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రిపుల్ ఐటీలో ఉన్న మెస్, మురుగునీటి సౌకర్యాలు మెరుగుపరుస్తామని, విద్యార్థుల విద్యను సులభతరం చేయడానికి కొత్త సాంకేతిక పరికరాలను అందిస్తామని తెలిపారు. విద్యార్థులను క్రీడల్లో రాణించేలా 6 నెలల్లో నిర్మించనున్న మినీ ఔట్‌డోర్‌ స్టేడియం కోసం రూ.3కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు.

- Advertisement -

ఆధునిక ఫర్నిచర్‌తో కూడిన 50 తరగతి గదులతో పాటు 1000 కంప్యూటర్‌లతో అత్యాధునిక డిజిటల్ ల్యాబ్ కూడా నిర్మిస్తామన్నారు. విద్యార్థుల ఆందోళన గురించి కూడా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. విద్యార్థుల ఆందోళనలకు ప్రతి రోజూ టీవీల్లో, పేపర్లలో చూశానని.. రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు పోరాడారని గుర్తు చేశారు. విద్యార్థులు ఎంచుకున్న పద్ధతి, స్ఫూర్తి తనకు నచ్చిందని.. శాంతియుతంగా పోరాటం చేయడం అభినందనీయమని కొనియాడారు. గాంధీ సత్యాగ్రహం ఎలా చేశారో.. అలానే శాంతియుతంగా ఆందోళన చేసి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారన్నారు. తెలంగాణలో అద్భుత ప్రతిభ కలిగిన విద్యార్థులంతా ఇక్కడే ఉన్నారని మంత్రి కేటీఆర్ అభినందించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All