Homeటాప్ స్టోరీస్లైగర్ నుండి రేపు న్యూ మిషన్ రిలీజ్

లైగర్ నుండి రేపు న్యూ మిషన్ రిలీజ్

laiger A new MISSION is ready
laiger A new MISSION is ready

విజయ్ దేవరకొండ – అనన్య పాండే జంటగా డాషింగ్ డైరెక్టర్ పూరి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం లైగర్. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ , మేకింగ్ వీడియోస్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై ఆసక్తి పెంచగా..రేపు న్యూ మిషన్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేశారు.

ఈ సినిమాను చాలాభాగం ముంబైలో షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఆగష్టు 25న పాన్ ఇండియాగా 5 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఛార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ద్వారా ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All