Homeటాప్ స్టోరీస్నా మొగుడు నా బీరు నా ఇష్టం అంటున్న మహిళ

నా మొగుడు నా బీరు నా ఇష్టం అంటున్న మహిళ

lady fires on drunk and driveనా మొగుడు ఒక్క బీరు తాగి డ్రైవ్ చేస్తే తప్పేంట్రా అంటూ అర్ధరాత్రి ఓ మహిళ ట్రాఫిక్ పోలీసులపై జులుం ప్రదర్శించింది . ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది . నా మొగుడు ….. నా మొగుడు ….. నా మొగుడు అంటూ కనీసం వంద సార్లైనా అని ఉంటుంది అంతేకాదు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది ఆ మహిళ . ఒక్క బీరు తాగితే తప్పేంటి ? అలా తాగడం తప్పైతే మద్యం దుకాణాలు రాత్రి వరకు ఉంచకుండా మూసేయండి అంటూ పోలీసులనే ఎదురు ప్రశ్నించింది అలాగే ఈ మొత్తం తతంగమంతా వీడియో కూడా తీసింది .

నాకు ఫేస్ బుక్ లో బోలెడు అకౌంట్ లున్నాయని అలాగే ఇతర మాధ్యమాల్లో కూడా పెడతానని పోలీసుల ముందే హెచ్చరిస్తూ చెప్పడంతో అడ్డుకున్నారు దాంతో ఆ మహిళ మరింతగా రెచ్చిపోయింది . ఈ దశలో సదరు మహిళ భర్తపై పోలీసులు దాడి చేయడంతో నా మొగుడ్ని కొడతారా అంటూ వీరంగం వేసింది . ప్రస్తుతం ఆ వీడియో వాట్సాప్ లో అలాగే ఇతర మాధ్యమాల్లో వైరల్ అవుతోంది . తాగి నడిపిస్తున్న భర్త ని వెనకేసుకురావడం మహిళా తప్పే ! అలాగే అర్ధరాత్రి వరకు బార్లు , రెస్టారెంట్ లు కొనసాగేలా చేస్తూ జేబులు గుల్లజేయడమే కాకుండా ఆరోగ్యాన్ని హరించేలా చేస్తున్నారు అంతేకాదు డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో అడ్డుకుంటూ పౌరుల జీవితంతో ఆడుకుంటున్నారు పోలీసులు .

- Advertisement -

English Title: lady fires on drunk and drive

https://www.youtube.com/watch?v=I6S3Nk7gIIY

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All