
ఆచార్య మూవీ నుండి ‘లాహే లాహే’ సాంగ్ ప్రోమో వచ్చింది.మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచానాలు నెలకొని ఉన్నాయి. ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ సినిమా ప్రొమోషన్లను వేగవంతం చేసింది. రీసెంట్ గా ట్రైలర్ ..భలే భలే సాంగ్స్ వచ్చి ఆకట్టుకోగా..శుక్రవారం చిత్రంలోని ‘లాహే లాహే’ సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేసారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చగా..మణిశర్మ మ్యూజిక్ అందించారు. ప్రోమోలో చిరంజీవి, నటి సంగీత అదిరిపోయే స్టెప్స్ తో ఆకట్టుకున్నారు.
మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఈ భారీ మూవీని శ్రీమతి సురేఖ సమర్పణలో నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ నిర్మించారు. అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవి ఎండోమెంట్ అధికారికగా ఓ దశలో చరణ్ తో కలిసి నక్సలైట్ గా నూ కనిపించబోతున్నారు.