Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్వినాయక చవితికి రిలీజ్ కానున్న యాక్షన్ కింగ్ అర్జున్ 150వ సినిమా ‘‘కురుక్షేత్రం’’

వినాయక చవితికి రిలీజ్ కానున్న యాక్షన్ కింగ్ అర్జున్ 150వ సినిమా ‘‘కురుక్షేత్రం’’

Kurukshetram movie get release dateయాక్షన్ కింగ్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు అర్జున్. వెండితెరపై మార్షల్ ఆర్ట్స్ కు మంచి గుర్తింపు తెచ్చిన అర్జున్.. ఇమేజ్ నే ఇంటిపేరుగా మార్చుకుని యాక్షన్ కింగ్ గా మారాడు. యాక్షన్ హీరోగా దక్షిణాది ప్రేక్షకులందరికీ సుపరిచుతుడైన అర్జున్.. ఇప్పుడు తన కెరీర్ లో అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆ తరం హీరోలంతా రిటైర్ అవుతోన్న వేళ తను ఏకంగా హీరోగా 150వ సినిమా చేశాడు. అదే కురుక్షేత్రం.

- Advertisement -

అర్జున్ ఇమేజ్ కు అనుగుణంగా.. అత్యంత స్టైలిస్డ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ఈ వినాయక చవితి సందర్భంగా విడుదల చేయబోతున్నారు.తమిళంలో ‘‘నిబునన్’’ పేరు తో రిలీజై మంచి పేరుతో పాటు కమర్షియల్ కూడా మంచి వసూళ్లు రాబట్టిన ఈ మూవీ అత్యంత స్టైలిష్ గా తెరకెక్కించాడు దర్శకుడు అరుణ్ వైద్యనాథన్. ప్యాషన్ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ను శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీనివాస్ మీసాల తెలుగులో ఈ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ తో పాటు ఈ మూవీలో ఇంకా సుమన్, సుహాసిని, ప్రసన్న, వైభవ్, శ్రుతి హరిహరన్ ఇతర పాత్రల్లో నటించారు.

సాంకేతిక నిపుణులు :

శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్
సంగీతంః ఎస్. న‌వీన్,
మాటలు- శశాంక్ వెన్నెలకంటి
సినిమాటోగ్ర‌ఫీః అర‌వింద్ కృష్ణ‌,
ఎడిటింగ్ః స‌తీష్ సూర్య‌,
స్క్రీన్ ప్లే – ఆనంద్ రాఘవ్ ,అరుణ్ వైద్య నాథ‌న్
కో ప్రొడ్యూసర్ – సాయి కృష్ణ పెండ్యాల
నిర్మాత – శ్రీనివాస్ మీసాల, ఫ్యాషన్ స్టూడియోస్
క‌థ‌,స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం – అరుణ్ వైద్య నాథ‌న్.

English Title: Kurukshetram movie get release date

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts