Homeటాప్ స్టోరీస్దొంగతనం కేసులో అరెస్ట్ అయిన గీత రచయిత

దొంగతనం కేసులో అరెస్ట్ అయిన గీత రచయిత

Kulasekhar arrested in theft caseదొంగతనం కేసులో ప్రముఖ గీత రచయిత కులశేఖర్ అరెస్ట్ అయ్యాడు . తేజఆర్పీ పట్నాయక్ ల కాంబినేషన్ లో వచ్చిన పలు సూపర్ హిట్ చిత్రాలకు సూపర్ హిట్ పాటలను రాసాడు ఈ కులశేఖర్ . దాదాపు వంద సినిమాల్లో పాటలు రాసాడు కులశేఖర్ . అయితే కెరీర్ బ్రహ్మాండంగా సాగిపోతున్న సమయంలో ఓ చిత్రానికి దర్శకత్వం వహించాడు . దాని తర్వాత కులశేఖర్ కు సినిమాలు లేకుండాపోయాయి . దానికి తోడూ ఓ చిన్న సంఘటన వల్ల మతిస్థిమితం కూడా కోల్పోవడంతో దొంగతనాలకు పాల్పడుతున్నాడు . ఇంతకుముందు కూడా ఓ దొంగతనం కేసులో దొరికి ఆరునెలల జైలు జీవితం గడిపాడు .

హైదరాబాద్ లోని మోతీనగర్ లో ఉంటున్న కులశేఖర్ తాజాగా ఓ పూజారి బ్యాగ్ ని కొట్టేసి మళ్ళీ అరెస్ట్ అయ్యాడు . ఇందిరానగర్ లోని గుడిలో పూజారి బ్యాగ్ కొట్టేయగా సిసి ఫుటేజి ని పరిశీలించిన పోలీసులు కులశేఖర్ ని అరెస్ట్ చేసారు . కులశేఖర్ దగ్గర ఉన్న 40 వేల నగదుతో పాటుగా 50 వేల విలువ చేసే పలు ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు . ఒకటేమో బ్రతుకు దెరువు కోసం , మరొకటేమో కొద్దిగా మతి చలించడం వల్ల ఈ నేరాలకు పాల్పడుతున్నాడు కులశేఖర్ .

- Advertisement -

English Title: Kulasekhar arrested in theft case

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All