Homeటాప్ స్టోరీస్కోడి రామకృష్ణ మృతికి సంతాపం- కేఎస్ రామారావు, కె ఎల్ నారాయణ

కోడి రామకృష్ణ మృతికి సంతాపం- కేఎస్ రామారావు, కె ఎల్ నారాయణ

KS RAMARAO AND KL NARAYANA CONDOLENCE TO KODI RAMAKRISHNAకోడి రామకృష్ణ నాకు ఆత్మీయులు. ఇండస్ట్రీలో అందరికీ మంచి మిత్రులు. అందరితోనూ ఎంతో సన్నిహితంగా ఉంటారు. మా దుర్గ ఆర్ట్స్ బ్యానర్లో ‘దొంగాట’ లాంటి శతదినోత్సవ చిత్రాన్ని ఇచ్చారు. ఎప్పుడు కలిసినా ‘ఎం డైరెక్టర్ గారు అనగానే…చంపేద్దాం గురువు గారు’ అనేవారు. అందరితో చాలా కలుపుగోలుగా ఉండేవారు. దేనికైనా ఆయన ఉత్సాహంగా ముందుండే వారు. అలాంటి వ్యక్తి లేకపోవడం చాలా లోటు. వ్యక్తిగతంగా మంచి మిత్రున్ని కోల్పోయాను. పరిశ్రమకు కూడా తీరని లోటు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

– ప్రముఖ నిర్మాత, నిర్మాతల మండలి అధ్యక్షులు డా || కె ఎల్ నారాయణ

- Advertisement -

 

ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించిన ఉత్తమ దర్శకుడు, పరిశ్రమలో అందరికీ ఎంతో ఆప్తుడు, నాకు మంచి మిత్రులు కోడి రామకృష్ణ గారు లేకపోవడం పరిశ్రమకి ఎప్పటికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యులకు నా సానుభూతిని తెలుపుతున్నాను.

– కె ఎస్ రామారావు, క్రియేటివ్ కమర్షియల్స్

English Title: KS. RAMARAO AND KL ,NARAYANA CONDOLENCE TO KODI RAMAKRISHNA

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All