Homeటాప్ స్టోరీస్అద్దె గర్భం తో  'వన్' హీరోయిన్

అద్దె గర్భం తో  ‘వన్’ హీరోయిన్

Kriti Sanon Mimi Movie News
అద్దె గర్భం తో ‘వన్’ హీరోయిన్

బాలీవుడ్ అందాల తార కృతి సనన్ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అద్దె గర్భం కథా నేపథ్యంగా రూపొందుతున్న మిమి అనే చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. సూపర్‌స్టార్ మహేష్‌బాబు, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌ లో  రూపొందిన 1 నేనొక్కడినే చిత్రం ద్వారా కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే.

ఇటీవల విజయవంతమైన లుకా చుప్పీ సినిమా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ రూపొందిస్తున్న ఈ సినిమాపై కృతి గంపెడు ఆశలు పెట్టుకొన్నట్టు తెలుస్తున్నది. మిమి అనే సినిమా కథ అత్యంత భావోద్వేగమైనది. కథ చెప్పినప్పుడు ఒకింత ఎక్సైటింగ్‌గా, కొంత నెర్వస్‌గా ఫీలయ్యాను. ఇప్పటి వరకు నేను చేయనటువంటి పాత్ర నాకు లభించింది.

- Advertisement -

అనేక రకాల ఎమోషన్స్ పలికించే చిత్రంగా భావిస్తున్నారు. అంతేకాకుండా నటిగా నాకు ఛాలెంజ్. మిమి సినిమా నటిగా నాకు బాధ్యతను నేర్పే సినిమా. నేను కొత్తగా, విభిన్నమైన పాత్రలు ధరించాలని ఆలోచిస్తున్నపుడు..  నాకు ఆ పాత్ర లభించింది. అలాగే ఎన్నో ఏళ్లుగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో నటించాలని చూస్తున్నాను.

ఆ క్రమంలో నాకు ఈ పాత్ర, సినిమా లభించడంతో చాలా సంతోషంగా ఉన్నానులైఫ్ అనేది ఊహించని అద్భుతాలతో సాగే ఓ ప్రయాణం. ఇంతకు ముందెన్నడూలేని  ప్రయాణానికి గెట్ రెడీ అవుతున్నా. ఇది నాకు అత్యంత ప్రత్యేకమైనది. నా హృదయానికి దగ్గరైన సినిమా. ఈ సినిమా నవ్విస్తుంది. ఏడిపిస్తుంది? ఫీల్‌గుడ్ ఎమోషన్స్ పలికిస్తుంది.

అన్ని రకాల భావోద్వేగాన్ని పండిస్తుంది. దర్శకుడు లక్ష్మణ్ సార్ ఎమోషన్స్‌ను వినోదాత్మకంగా తెరపైన చెబుతున్నారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుడు ఓ చక్కటి అనుభూతిని పొందుతారు..   అంటూ కృతి సనన్ ట్వీట్ చేశారు…!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All