
పవన్ కళ్యాణ్ సరసన తీన్మార్ చిత్రంలో జోడి కట్టిన కృతి కర్బంద..ఖతర్నాక్ పోజ్ లో దర్శనం ఇచ్చి అబ్బా అనిపించింది. తెలుగు లో ఈమె బోణి అనే సినిమా తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అలా మొదలైంది లో చిన్న రోల్ చేసింది. మిస్టర్ నూకయ్య.. ఒంగోలు గిత్త.. ఓమ్.. బ్రూస్ లీ ( చరణ్ అక్క పాత్ర), తీన్మార్ సినిమాల్లో నటించింది. అవేవి కూడా పెద్దగా గుర్తింపు తీసుకరాలేకపోయాయి. దీంతో హిందీ లో సెటిల్ అయిపొయింది.
ఇదే తరుణంలో సోషల్ మీడియా లో రెచ్చిపోతూ హాట్ హాట్ పోజ్ లతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఈమె పోల్ డాన్స్ ను ప్రాక్టీస్ చేస్తూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. మూడు పదుల వయసు దాటినా కూడా ఈమె కొత్త హీరోయిన్స్ కు పోటీ అన్నట్లుగా ఈమె అందంతో ఆకట్టుకుంటూ అబ్బో అనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇన్ స్టా లో దాదాపుగా 7.3 మిలియన్ ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈమె ఇప్పటికి కూడా హిందీ లో వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంటుంది. వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలు చేస్తున్న ఈమె ను అభిమానించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.