
ఉప్పెన బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. యంగ్ హీరోస్ తో మాత్రమే కాకుండా సీనియర్ హీరోల పక్కన కూడా నటించేందుకు ఒకే చెపుతుంది. తాజాగా ఈ బ్యూటీ..తమిళ్ హీరో సూర్య సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆకాశమే నీ హద్దురా , జై భీమ్ చిత్రాలతో అలరించిన సూర్య..రీసెంట్ గా ఈటీ మూవీ తో వచ్చి భారీ ప్లాప్ అందుకున్నాడు. ఈ సినిమా ఫలితం తో సంబంధం లేకుండా తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు.
సూర్య ఇటీవల తన 41వ చిత్రాన్ని డైరెక్టర్ బాలాతో ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది. సూర్య జ్యోతిక సమర్పణలో 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ మూవీ నిర్మితం కానుంది. ఈ మూవీ లో కృతి శెట్టి ని హీరోయిన్ గా ఎంపిక చేశారట. అయితే ఈ సినిమాకు కృతి శెట్టి రెమ్యూనరేషన్ భారీగా పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తెలుగు సినిమాలకు కోటి వరకు రెమ్యునరేషన్ అందుకున్న కృతి శెట్టి.. సూర్య సినిమాకు మాత్రం ఏకంగా రూ. 1.5 కోట్లు డిమాండ్ చేసిందట. ఇక ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు సైతం అంత మొత్తంలో ఇచ్చేందుకు ఓకే చెప్పారని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.