Homeటాప్ స్టోరీస్ప్రభాస్ - అనుష్క ల పెళ్లి ఫై కృష్ణం రాజు భార్య కామెంట్స్

ప్రభాస్ – అనుష్క ల పెళ్లి ఫై కృష్ణం రాజు భార్య కామెంట్స్

Krishnam Raju Wife Shyamala Devi About Prabhas Marriage
Krishnam Raju Wife Shyamala Devi About Prabhas Marriage

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పిలవబడే ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తూ కెరియర్ ను జెట్ స్పీడ్ గా తీసుకెళ్తున్నాడు. కానీ పెళ్లి మాత్రం చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఉండిపోతున్నాడు. ఈ ఏడాదైనా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడేమో..అనుకుంటూ అభిమానులు ఏళ్లు గడుపుతున్నప్పటికీ ప్రభాస్ మాత్రం పెళ్లి ఫై ఏమాత్రం ఇంట్రస్ట్ చూపించడం లేదు. తాజాగా తనకు పెళ్లి కాకపోవడానికి కారణం తాను అమ్మాయిల విషయంలో వేసుకున్న లెక్కలు ఫెయిల్ అయ్యాయని అందుకనే పెళ్లి కాలేదేమోనని రాధే శ్యామ్ మూవీ ప్రమోషన్ లలో చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటె గత కొద్దీ నెలలుగా ప్రభాస్ – అనుష్క లు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. ప్రభాస్ పెళ్లి ప్రస్తావన ఎప్పుడు బయటకు వచ్చిన టక్కున అనుష్క పేరే వినిపిస్తుంది. ప్రస్తుతం కూడా అలాగే వినిపిస్తుండడం తో ఈ వార్తల ఫై కృష్ణం రాజు భార్య శ్యామ‌ల దేవి స్పందించారు. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. ‘ప్రభాస్‌కి మ‌న సంస్కృతి సంప్ర‌దాయాలంటే ఎంతో గౌర‌వం ఉంది. మ‌హిళంటే గౌర‌వం ఉంది. కుటుంబానికి.. ఇంటి పెద్ద‌ల‌కు గౌర‌వం ఇస్తారు. ప్రభాస్ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఆయ‌న బిజీగా ఉన్నారు ’’ అని తెలిపింది. సోషల్ మీడియా లో ఓ నటిని పెళ్లి చేసుకుంటాడనే వార్తల్లో నిజం లేదని తెలిపింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All