
హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్న నాగ శౌర్య..తాజాగా కృష్ణ వ్రిందా విహారి మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అనీష్ ఆర్. కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీని ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని అనుకున్నారు కానీ కెజిఎఫ్ 2 భారీ సక్సెస్ తో దూసుకెళ్తుండడం..ఏప్రిల్ 29 ఆచార్య రిలీజ్ ఉండడంతో వాయిదా వేశారు. మే 06 న అనుకున్నప్పటికీ..తాజాగా మే 20 న రిలీజ్ చేసేందుకు డిసైడ్ అయ్యారు. దీనికి సంబదించిన అధికారిక ప్రకటన చేసారు.
ఇక ఈ మూవీ లో నాగశౌర్య బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తుండగా..సీనియర్ నటి రాధికా కీలక పాత్రలో నటిస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ లో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరుల నటించగా ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు.