Homeటాప్ స్టోరీస్కడు రమణీయం..కోటీ దీపోత్సవ సంబురం..

కడు రమణీయం..కోటీ దీపోత్సవ సంబురం..

-NTV, భక్తి టీవి అధ్వర్యంలో జరిగే ఆధ్యాత్మిక పండుగను చూద్దాం రండి..
కార్తికమాసం వస్తోందంటే తెలుగు రాష్ట్రాల్లో, తెలుగువారుండే ప్రాంతాల్లో తప్పకుండా చర్చకు వచ్చేది ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో జరిగే కోటి దీపోత్సవం!హిందూధర్మపరిరక్షణే లక్ష్యంగా, నలుదిశలా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లాలన్న ధ్యేయంతో ఎన్టీవీ ఛైర్మన్ తుమ్మల నరేంద్రచౌదరి, రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో దిగ్విజయంగా కొనసాగుతోంది…కోటి దీపోత్సవం. ఈయేడాది కూడా కోటి దీపోత్సవ నిర్వహణకు సర్వహంగులతో ఏర్పాట్లు సాగుతున్నాయి. కార్తికదీపోత్సవం నేపథ్యంలో ఈమాసం విశిష్టత దగ్గర నుంచి వ్రతాలు,పూజలు,కల్యాణాలతో సహా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలను ఈరోజు నుంచి ఒక్కొక్కటీ చదువుకుందాం. ఈ కార్యక్రమాలన్నీ కోటి దీపోత్సవం జరిగే ఎన్టీయార్ స్టేడియంలో ఎంతటి సంప్రదాయబద్ధంగా సాగుతుంటాయో తెలుసుకుందాం. ఇందులో భాగంగా ముందుగా ఈరోజు కార్తిక మాసం ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.

- Advertisement -

కార్తికమాసం :-
న కార్తికసమో మాసో
న కృతేన సమం యుగమ్
న వేదసదృశం శాస్త్రం
న తీర్థం గంగయా సమమ్
ఈశ్లోకం అర్థం ఏమిటంటే… కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు.కృతయుగంతో సమానమైన యుగమేదీ లేదు. వేదాలతో సమానమైన శాస్త్రమేదీ లేదు.గంగకంటే పుణ్యప్రథమైన తీర్థం మరి లేదన్నది పురాణవచనం. దీపావళి మరుసటి రోజు నుంచి మొదలయ్యే కార్తికమాసం అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి.
సాధారణంగా చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో, ఆ నక్షత్రం పేరిట ఆ మాసం వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు సంపూర్ణుడై సంచరిండం వల్ల ఈ మాసానికి కార్తికమాసమని పేరు.

పవిత్రమాసం :-

కార్తిక మాసం అత్యంత పవిత్రమైంది. శివ కేశవులకి ప్రీతికరమైన మాసం. అందుకే ఈ మాసం మహిమాన్వితమైంది. ఈ మాసంలో దేశం నలుమూలలా దాదాపు అన్ని ఆలయాలలో రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు,రుద్ర పూజలు విశేషంగా జరుగుతుంటాయి. విశేషార్చనలు చేసే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలను తీరుస్తాడు. ఉపవాసాలకు, నోములకు, వ్రతాలకు ఈమాసంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది అయినప్పటికీ ప్రత్యేకించి శివారాధకులు అత్యంత పవిత్రంగా భావించే మాసమిది.

మహత్తర అవకాశం :-

ఈ నెలరోజులపాటు ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో దీపాలు వెలిగిస్తారు. కార్తికమహాపురాణం పారాయణం చేస్తారు. కార్తిక సోమవారాలు, కార్తిక పౌర్ణమి పర్వదినాల్లో విశేషపూజలు నిర్వహిస్తారు. అందుకే ఆధ్యాత్మికప్రపంచంలో విశిష్ట స్థానాన్ని ఆక్రమించిన భక్తి టీవీ…ఈ కార్తికమాసాన్ని ఓ యజ్ఞంగా భావిస్తుంది. కార్తికమాసంలో చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ…తలపెట్టిన 15రోజుల్లోనే పూర్తిచేసేందుకు భక్తులకు ఓ మహత్తర అవకాశం కల్పిస్తున్నాయి..ఎన్టీవీ-భక్తి టీవీ.

సామూహిక స్తోత్రపఠనం :-

భక్తులు ఈకార్యక్రమంలో పాల్గొంటే…ఈమాసంలో పఠించే స్తోత్రాలు, చేసుకునే వ్రతాలు, చేయాల్సిన పూజలు, చేయాల్సిన పనులన్నింటితో సమగ్రంగా,సామూహికంగా, సంప్రదాయబద్ధంగా చేసుకొని తరించే అద్భుత అవకాశం కలుగుతుంది. ఉదాహరణకు…కార్తికమాసంలో పఠించే స్తోత్రాలైన
శివపంచాక్షరీ స్తోత్రం, వామనస్తోత్రం, శివశోడక్షరీ స్తోత్రం,శ్రీశివస్తోత్రం, మార్కండేయకృత శివస్తోత్రం, లింగాష్టకం, బిల్వాష్టకం,శివాష్టకం, సుబ్రహ్మణ్యాష్టకం, శ్రీకృష్ణాష్టకం, సూర్యస్తుతి, గణేశస్తుతి, దశావతార స్తుతి, దామోదరస్తోత్రం, అర్థనారీశ్వరస్తోత్రం, మృత్యుంజయ మహామంత్రజపం, శ్రీ విష్ణుస్తోత్రం,తులసీ కవచం…ఇవన్నీ ఈ కోటి దీపోత్సవం జరిగే రోజుల్లో ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతిధ్వనిస్తుంటాయి.

ఇక వ్రతాలు, పూజలు, కార్తికమాసంలో చేయాల్సిన పనుల విషయానికి వస్తే..భక్తులకు ఓపిక ఉండాలేకానీ అక్కడ జరగని వ్రతాలుండవు, జరగని పూజలుండవు. కడురమణీయం..కోటిదీపోత్సం సంరంభం!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All