
మిర్చి మూవీ తో పక్కా మసాలా చిత్రాన్ని తెరకెక్కించిన కొరటాల శివ..ఆ తర్వాత శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అను నేను వంటి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలు చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు చిరంజీవి తో చేసిన ఆచార్య మూవీ కూడా మెసేజ్ ఓరియంటెడ్ కథే. రేపు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక దీని తర్వాత ఎన్టీఆర్ 30 వ చేయనున్నాడు. కాకపోతే ఇది పక్కా మసాలా మూవీ అంటున్నాడు కొరటాల.
అందరూ అనుకున్న విధంగా ఈ సినిమా పొలిటికల్ సినిమా కాదని, పొలిటికల్ సబ్జెక్ట్ అసలు ఏమాత్రం చేయడం లేదని చెప్పుకొచ్చారు. అదేవిధంగా తన ప్రతి సినిమాలో ఏదో ఒక విధమైన మెసేజ్ అంతర్లీనంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అని కానీ ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమా విషయంలో మాత్రం అలాంటి మెసేజ్ లు ఇవ్వడం లేదని అన్నారు. పూర్తిస్థాయి మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతుందని కొరటాల శివ చెప్పుకొచ్చారు.