Homeటాప్ స్టోరీస్NTR30 మూవీ ఫై కొరటాల కామెంట్స్

NTR30 మూవీ ఫై కొరటాల కామెంట్స్

koratala siva about NTR30
koratala siva about NTR30

ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో ఎన్టీఆర్ 30 వ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపుగా నాలుగు సంవత్సరాల పాటు సమయం ను కేటాయించాడు. ఎన్టీఆర్ మరియు కొరటాల ల కాంబోలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన వార్తలు గత ఏడాది కాలంగా వస్తూనే ఉన్నాయి.

తాజాగా ఆచార్య సినిమా విడుదల నేపథ్యంలో మీడియాతో కొరటాల శివ మాట్లాడుతూ.. త్వరలోనే ఎన్టీఆర్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ కాబోతుందని , జులై లో సెట్స్ పైకి రాబోతుందని శివ చెప్పుకొచ్చారు.
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆచార్య సినిమా సూపర్ హిట్ అయితే ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో చేసే అవకాశం ఉంది.

- Advertisement -

ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబో మూవీ కేవలం మూడు నెలల్లోనే పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా ఎన్టీఆర్ 30 సినిమాను ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని సుధాకర్ మరియు కళ్యాణ్ రామ్ లు భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All