Homeగాసిప్స్మిర్చి కాంబో మళ్ళీ సెట్ అవ్వనుందా?

మిర్చి కాంబో మళ్ళీ సెట్ అవ్వనుందా?

మిర్చి కాంబో మళ్ళీ సెట్ అవ్వనుందా?
మిర్చి కాంబో మళ్ళీ సెట్ అవ్వనుందా?

రెబెల్ స్టార్ ప్రభాస్ రెబెల్ సినిమా దారుణమైన ఫలితం అందుకున్న తర్వాత ఒక కథ విన్నాడు. అది అతనికి బాగా నచ్చింది. కానీ ఈ కథ ఒప్పుకోవడానికి ఆలోచిస్తున్నాడు. కథ చెప్పిన కొత్త దర్శకుడికి నో చెప్పేద్దామని డిసైడ్ అయ్యాడు. ఆ ఆలోచన ఎందుకంటే అప్పటికే ప్రభాస్ బాహుబలి సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ సినిమా చేస్తే బాహుబలికి అడ్డంకి అవుతుందేమో అని ప్రభాస్ ఆలోచన. అందుకే నో చెబుదామనుకున్నాడు. ఎందుకైనా మంచిదని ఒకసారి రాజమౌళిని సంప్రదిద్దామని డిసైడ్ అయి ఒకసారి ఈ విషయం చెప్పాడు. అప్పుడు రాజమౌళి కథ బాగుంది అసలు వదులుకోకు ఆరు నెలల్లో అయిపోతుంది కదా.. నాకు ఎలాగూ బాహుబలిని సెట్ చేయడానికి నాలుగైదు నెలలు పడుతుంది. ఏం ఆలోచించకుండా ఒప్పేసుకో అని చెప్పాడు. ప్రభాస్ వెంటనే ఆ కొత్త దర్శకుడికి ఓకే చెప్పేసాడు. అప్పుడు చేసిన సినిమానే మిర్చి. ఆ కొత్త దర్శకుడే కొరటాల శివ.

ఇప్పుడిదంతా ఎందుకంటే దానికి కూడా రీజన్ ఉంది. కొరటాల శివ, ప్రభాస్ మరోసారి కలిసి సినిమా చేసే అవకాశముంది. ఈ మేరకు ఇద్దరూ ఫార్మల్ గా దీపావళి సందర్భంగా కలిసినట్లు తెలిసింది. కొరటాల శివ తన దగ్గర ఉన్న ఒక ఐడియాను ప్రభాస్ కు చెప్పాడు. ప్రభాస్ కూడా పాజిటివ్ గానే స్పందించాడు. ప్రభాస్ ఇటీవలే లండన్ హాలిడే నుండి తిరిగొచ్చిన సంగతి తెల్సిందే. వచ్చి రాగానే జాన్ సినిమా షూటింగ్ అప్డేట్స్ పై క్లారిటీ ఇచ్చేసాడు. ఆ సినిమాకు టీమ్ తో కూర్చుని కొంత ప్రొడక్షన్ డిజైనింగ్ లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అనవసర హంగుల జోలికి వెళ్లకుండా బడ్జెట్ కంట్రోల్ లో ఉండేలా ప్లాన్ చేసారు. షూటింగ్ కూడా నవంబర్ నుండి మొదలుకానుంది. హైదరాబాద్ లో ఈ షెడ్యూల్ కోసం భారీ సెట్ కూడా వేశారు. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు.

- Advertisement -

జాన్ సినిమా తర్వాత ఏ సినిమా చేయాలా అన్న ఆలోచనలో ప్రభాస్ పడినట్లు సమాచారం. ఈ మేరకు కొన్ని పాజిబిలిటీస్ ను కూడా చూశాడట. ఈ మేరకే కొరటాల శివతో జరిగిన డిస్కషన్ అని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ సమయానికి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది. అయితే కొరటాల శివ మరి కొన్ని రోజుల్లో చిరంజీవితో సినిమా కోసం షూటింగ్ ను మొదలుపెట్టాలి. ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలని అనుకుంటున్నారు. చిరంజీవితో సినిమా పూర్తైన తర్వాతే కొరటాల శివ పూర్తి స్థాయిలో ప్రభాస్ స్క్రిప్ట్ మీద కూర్చోవాల్సి ఉంటుంది. మరి అప్పటికి పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి. కొరటాల శివతో చేయబోయే చిత్రం కూడా ప్యాన్ ఇండియా లెవెల్లోనే తెరకెక్కుతోందని సమాచారం. ఇప్పటికే ప్రభాస్ కు హిందీలో మార్కెట్ స్థిరపడడంతో ప్రభాస్ ఇకపై తన సినిమాలన్నీ అక్కడ కూడా విడుదల చేయాలని కోరుకుంటున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All