
కోలీవుడ్ స్టార్ హీరో శింబు తను నటిస్తున్న మానాడు సినిమా ప్రమోషన్స్ లో జరిగిన వేడుకలో స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకున్నాడు. వెంకట్ ప్రభు డైరక్షన్ లో శింబు హీరోగా నటించిన మానాడు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చాలా ఏళ్లుగా వెంకట్ ప్రభుతో సినిమా చేయాలని అనుకున్నానని అది ఇప్పటికి కుదిరిందని అన్నారు శింబు. అంతేకాదు తనని కొందరు కావాలని టార్గెట్ చేస్తున్నారని ఎమోషనల్ అయ్యారు. అయినా వారి సంగతి తాను చూసుకుంటానని. తన గురించి మీరు అంటే అభిమానులు చూసుకోండని అన్నారు శింబు.
తమిళ హీరోల్లో ప్రతి విషయంలో మీడియాకు టార్గెట్ గా మారుతాడు శింబు. అయితే శింబు అన్న ఆ కొందరు ఎవరు అన్నది ఇంకా తెలియలేదు. శింబు అలా కన్నీళ్లు పెట్టుకున్న టైం లో డైరక్టర్ తో పాటుగా మానాడు సినిమాలో విలన్ గా నటించిన ఎస్.జే సూర్య కూడా ఆయన్ను ఓదార్చే ప్రయత్నం చేశారు. మానాడు సినిమాలో ఎస్.జే సూర్య నటన గురించి కూడా శింబు ఈ సందర్భంగా ప్రస్థావించారు. ఎస్.జే సూర్య ఈ సినిమాలో అద్భుతంగా నటించారని అన్నారు శింబు.