Homeటాప్ స్టోరీస్వ్యాక్సిన్ వేయించుకున్న కింగ్ నాగార్జున‌!

వ్యాక్సిన్ వేయించుకున్న కింగ్ నాగార్జున‌!

king Nagarjuna gets covid 19 vaccine
king Nagarjuna gets covid 19 vaccine

టాలీవుడ్ స్టార్ నాగార్జున కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. టాలీవుడ్‌లో వ్యాక్సిన్ వేసుకున్న తొలి స్టార్ కూడా ఆయ‌నే. నాగ్ ఈ రోజు (బుధ‌వారం) ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అంతే కాకుండా త‌ను వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫొటోని అభిమానుల‌తో పంచుకున్నారు కూడా.   హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తను టీకా వేయించుకుంటున్న ఫొటోని పోస్ట్ చేశారు.

`నిన్న నా కోవాక్సిన్ టైమ్‌ వచ్చింది` అని ఈ 61 ఏళ్ల హీరో చెప్పారు. `ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేదు. టీకా తీసుకోవడానికి ఎవ‌రైతే అర్హులో వారంతా వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని నేను కోరుతున్నాను. మీరు ఇప్పుడు మీ కోవిడ్ 19 వాక్సిన్ కోసం http://cowin.gov.in లో నమోదు చేసుకోవచ్చు. వ్యాక్సిన్ పొంద‌వ‌చ్చు అని ట్వీట్ చేశారు.

- Advertisement -

బ్లాక్ స్పోర్ట్స్ టీ షర్టు కార్గో జీన్స్, మూతిని మాస్క్‌ ధరించి నాగ్  వ్యాక్సిన్ వేయించుకున్నారు. టాలీవుడ్‌లో  ప్ర‌తీ ప్ర‌యోగానికీ ముందుండే నాగార్జున వ్యాక్సిన్ విష‌యంలోనూ ముందు వ‌రుస‌లో నిల‌బ‌డ‌టం నిజంగా అభినందించ‌ద‌గ్గ‌దే.  ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `వైల్డ్ డాగ్‌`. 2009 వ‌రుస బాంబు పేలుళ్ల నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 2 న విడుదల కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All