
బాలీవుడ్‌లో డేటింగ్‌లు.. లవ్ స్టోరీలు సర్వసాధారణం. తాజాగా మరో బాలీవుడ్ జంట ప్రేమలో వుందంటూ వరుస కథనాలు వినిపిస్తున్నాయి. కియారా, సిద్ధార్ధ్ మల్హోత్రా డేటింగ్‌లో వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. `భరత్ అనే నేను` చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. తెలుగు, హిందీ భాషల్లో భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ హీరో సిద్దార్ధ్ మల్హోత్రాతో ప్రేమలో వుందంటూ ప్రస్తుతం వార్తలు షికారు చేస్తున్నాయి.
ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తూ కియారా, సిద్ధార్ధ్ మల్హోత్రా ముంబై ఏయిర్ పోర్ట్‌లో జంటగా కనిపించడంతో ఫొటో గ్రాఫర్లకు చిక్కారు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాతో పాటు బాలీవుడ్‌లోనూ వైరల్ అవుతున్నాయి. కియారా, సిద్ధార్ధ్ మల్హోత్రా ఇద్దరూ కలిసి న్యూ ఇయర్ వేడుకల్ని మాల్దీవ్స్‌లో జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగానే ముంబై ఏయిర్ పోర్ట్‌లో ఇద్దరూ కలిసి దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది.
గత కొంత కాలంగా రిలేషన్ షిప్ గురించి ఓపెన్ కాని ఈ జంట తాజాగా ముంబై ఏయిర్ పోర్ట్‌లో జంటగా కనిపించడం చర్చనీయాంశంగా మారింది. సిద్ధార్ధ్ మల్హోత్రా ప్రస్తుతం `మిషన్ మజ్ను` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది.