Homeటాప్ స్టోరీస్కేజిఎఫ్2 రిలీజ్ డేట్ ఖరారైందిగా!

కేజిఎఫ్2 రిలీజ్ డేట్ ఖరారైందిగా!

KGF 2 release date announced officially
KGF 2 release date announced officially

కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం కేజిఎఫ్ 2. ఈ సినిమా మొదటి భాగం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో సహజంగానే రెండో పార్ట్ పై అంచనాలు ఆకాశాన్నంటాయి. కేవలం కన్నడలోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. సో రెండో పార్ట్ ను అంతకు మించిన అంచనాలతో చూస్తారని టీమ్ కు కూడా తెలుసు. అందుకే అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అభిమానుల అంచనాలు ఎక్కడా తగ్గని విధంగా చిత్రాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపింది. గత కొంత కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు చివరి దశకు చేరుకుంది.

మొదటి భాగంలో ఎక్కువగా కన్నడ నటీనటులే కనిపించగా రెండో భాగంలో వాళ్ళే కంటిన్యూ అవుతారు కానీ బాలీవుడ్, టాలీవుడ్ నటులను కూడా తీసుకున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. అలాగే రవీనా టాండన్ మరో ముఖ్య పాత్రలో కనిపిస్తోంది. తెలుగు నటుడు రావు రమేష్ ఈ చిత్రంలో సీబీఐ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మే చివరికి ఈ చిత్ర షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. అలాగే ఈరోజు కేజిఎఫ్ 2 రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు.

- Advertisement -

జూన్, జులైతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ఆగష్టు నుండి ప్రమోషన్స్ మొదలుపెట్టి అక్టోబర్ 23న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నటుడు యష్ కేజిఎఫ్ 2 అక్టోబర్ 23న వస్తుందని అధికారికంగా తన సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఈ డేట్ చాలా మంచిదనే చెప్పాలి. ఎందుకంటే 25 నుండి దసరా పండగ కూడా ఉండడంతో అన్ని రాష్ట్రాల్లో సెలవులు కూడా ఉంటాయి. కేజిఎఫ్ 2 కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. మొదటి భాగాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ రెండో భాగాన్ని కూడా డైరెక్ట్ చేస్తున్న విషయం తెల్సిందే. హోంబలే ఫిల్మ్స్ కేజిఎఫ్ 2ను భారీ ఎత్తున నిర్మిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All