
యశ్ – ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘KGF Chapter 2’. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మించింది. సెకండ్ పార్ట్ లో విలన్ అధీరాగా సంజయ్ దత్ నటిస్తుండగా , రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలలో నటించడం తో సినిమా ఫై మరింత అంచనాలు పెరిగాయి. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ బాషలలో ఈ సినిమాను రేపు విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను ఏకంగా ప్రపంచవ్యాప్తంగా పది వేల థియేటర్లలో విడుదల చేస్తున్నారంటే సినిమా ఫై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
ఇక, ఈ సినిమాకు హైదరాబాద్ నగరంలో భారీ రెస్పాన్స్ వస్తోంది. రికార్డు ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘KGF Chapter 2’ మూవీ హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అప్పుడే రూ. 6.2 కోట్లకు పైగా గ్రాస్ కూడా వసూలు చేసి నాన్ RRR సినిమాల జాబితాలో మొదటి స్థానం సంపాదించింది. ఇక 40+ లక్షల అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లు కేవలం బుక్ మై షో, అలాగే పేటీఎం ద్వారా అమ్ముడయ్యాయని తెలుస్తుంది. మరి రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.