Homeటాప్ స్టోరీస్'KGF 2 ' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి మేకర్స్

‘KGF 2 ‘ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి మేకర్స్

kgf chapter 2 trailer date announced

కన్నడ అభిమానులే కాదు యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘KGF 2 ‘ ఒకటి. క‌న్న‌డ రాక్ స్టార్ య‌ష్ హీరోగా.. డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ నిర్మాణంలో తెరకెక్కిన ‘KGF ‘ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు..అలాంటి ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. దీంతో సినిమా కోసం అంద‌రూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవ్వడం తో సినిమా రిలీజ్ డేట్ మారింది. లేదంటే ఈపాటికి ప్రేక్షకుల ముద్నుకు వచ్చింది.

ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఏప్రిల్ 14న తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో చిత్ర ట్రైలర్ రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసారు.

- Advertisement -

KGF Chapter 2 ట్రైల‌ర్‌ను మార్చి 27 సాయంత్రం 6 గంట‌ల 40 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు హోంబ‌లే ఫిలింస్ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ ప్రకటన తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ మూవీ లో య‌ష్ జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా.. ఈ చిత్రంలో మెయిన్ విల‌న్ అధీర‌గా సంజ‌య్ ద‌త్ న‌టిస్తున్నారు. అలాగే మ‌రో కీల‌క పాత్ర‌లో ర‌వీనాటాండ‌న్‌, ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో ప్ర‌కాష్ రాజ్‌, రావు ర‌మేష్ త‌దిత‌రులు నటిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All