
యావత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న kGF 2 ట్రైలర్ రావడమే కాదు యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ రాబడుతూ వార్తల్లో నిలుస్తుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యాష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ తాలూకా ట్రైలర్ ను నిన్న ఆదివారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసి మరింత ఆసక్తి నింపారు. కేజీఎఫ్ సినిమా ఎంతటి సెన్సెషన్ క్రియేట్ చేసిందో చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఈ మూవీ అటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్… హీరో యష్ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్నారు. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కింది. ట్రైలర్ విషయానికి వస్తే .. 24గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 109మిలియన్లకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది. హిందీ(51మిలియన్లు), తెలుగు(20),కన్నడ(18), తమిళం(12), మలయాళం (8) మిలియన్ వ్యూస్ వచ్చాయి.