
యావత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం kGF 2 . ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యాష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ తాలూకా ప్రమోషన్ భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. కేజీఎఫ్ సినిమా ఎంతటి సెన్సెషన్ క్రియేట్ చేసిందో చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దానికి రెట్టింపులా ఈ సెకండ్ పార్ట్ ఉండబోతుందని తాజాగా విడుదలైన ట్రైలర్ చెప్పకనే చెపుతుంది.
ఏప్రిల్ 14 న ఈ మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సెన్సార్ కార్య క్రమాలను పూర్తి చేసింది. సినిమా చూసిన సెన్సార్ బృందం సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు. ఇక సినిమా మొత్తం రన్ టైమ్ 168 నిమిషాలు అంటే.. 2 గంటల 48 నిమిషాలు ఉంది. అలాగే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఏప్రిల్ 7న థియేట్రికల్ విడుదలకు వారం ముందు ప్రారంభమవుతుంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.