Homeటాప్ స్టోరీస్రివ్యూ : 'KGF Chapter 2' - ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్టైనర్

రివ్యూ : ‘KGF Chapter 2’ – ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్టైనర్

నటీనటులు : య‌శ్, సంజ‌య్ ద‌త్, శ్రీ‌నిధి శెట్టి, ర‌వీనా టాండ‌న్, ప్ర‌కాశ్ రాజ్, రావు రమేశ్‌ తదితరులు
నిర్మాణ సంస్థ: హోంబలే ఫిలింస్‌
దర్శకుడుఫ ప్రశాంత్‌ నీల్‌
సంగీతం: ర‌వి బ‌స్రూర్
విడుదల తేది: ఏప్రిల్‌ 14, 2022
టాలీవుడ్.నెట్ రేటింగ్ : 3.5/5

KGF 2 Movie Talk
KGF 2 Movie Talk

యశ్ – ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘KGF Chapter 2’. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మించింది. సెకండ్ పార్ట్ లో విలన్ అధీరాగా సంజయ్ దత్ నటిస్తుండగా , రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలలో నటించడం తో సినిమా ఫై మరింత అంచనాలు పెరిగాయి. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ బాషలలో ఈ సినిమా ఈరోజు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉంది…? యాష్ యాక్టింగ్ ఎలా ఉంది..? ఫస్ట్ పార్ట్ ను మించేలా ఉందా..లేదా..? అనేది పూర్తి రివ్యూ లో చూద్దాం.

- Advertisement -

కథ :

కేజీయఫ్‌ మూవీ ఎక్కడ ముగిసిందో.. అక్కడ నుంచి కేజీయఫ్‌ 2 కథ స్టార్ట్ అవుతుంది. గరుడను చంపిన తర్వాత నరాచి లైమ్‌ స్టోన్‌ కార్పొరేషన్‌ను రాకీ భాయ్‌ (యశ్‌) తన ఆధీనంలోకి తీసుకుంటాడు. గరుడ పెట్టే చిత్రహింసల నుంచి బయట పడడంతో అక్కడి కార్మికులు యశ్‌ని రాజుగా భావిస్తారు. తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు.

అయితే కేజీఎఫ్‌లోని కార్మికుల పాలిట యముడుగా పేరుపొంది అందరూ చనిపోయాడనుకున్న గరుడ బాబాయ్ అధిరా (సంజయ్ దత్ ) తిరిగొచ్చి రాఖీభాయ్‌ని అంతమొందించాలని పథకం వేస్తాడు. ఇంతలో ఢీల్లీ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకొని ప్రధానమంత్రిగా రమికాసేన్ (రవీనాటండన్) ప్రమాణ స్వీకారం చేస్తుంది. రాకీభాయ్ ఆగడాల్ని అణచాలని ఆమె ట్రై చేస్తుంటుంది. మరి రమికాసేన్.. అధిరా ఏంచేశారు..? వారి నుండి తప్పించుకొని రాఖీభాయ్ తిరిగి కేజీఎఫ్ కు ఎలా కింగ్ అయ్యాడు..? అనేది అసలు కథ.

ప్లస్ :

* రాఖీభాయ్ రోల్

* హీరో- విలన్ల మధ్య వార్

* విజువల్ గ్రాఫిక్స్

* భారీ యాక్షన్ సీక్వెన్సులు

మైనస్ :

* కథలో ట్విస్టులు లేకపోవడం

* అధిర పాత్ర పెద్దగా లేకపోవడం

* హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్‌

సాంకేతిక వర్గం :

* ర‌వి బ‌స్రూర్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథ కు బాగా సెట్ అయ్యింది.

* భువ‌న్ గౌడ‌ సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉంది.

* ఎడిటింగ్‌ బాగుంది.

* నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి

నటీనటుల తీరు :

* మొదటి భాగంతో పోలిస్తే యాష్.. ఇందులో మరింత స్టైలీష్‌గా, తనదైన మేనరిజంలో డైలాగ్స్‌ చెబుతూ..అదరగొట్టేశాడు. రాకీ భాయ్‌ పాత్రకు యశ్‌ తప్పితే మరొకరు సెట్‌ కాలేరు అన్న విధంగా అతని నటన ఉంది.

* అధీరగా సంజయ్‌ దత్‌ ఫెర్పార్మెన్స్‌ బాగుంది. ఆయన పాత్రని మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేది.

* ధానమంత్రి రమికా సేన్‌ పాత్రకి ర‌వీనా టాండ‌న్ న్యాయం చేసింది. రావు రమేశ్‌, ఈశ్వరి భాయ్‌, ప్రకాశ్‌ రాజ్‌తో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు.

ఇక డైరెక్టర్ విషయానికి వస్తే.. రాఖీభాయ్ పాత్రను మొదటి భాగం కన్నా పవర్ ఫుల్‌గా ఎలివేట్ చేసి.. ప్రేక్షకుల్ని కుర్చీలకు కట్టేయగలిగాడు. మరింత ఆసక్తికరమైన కథనంతో సన్నివేశాల్ని అల్లుకొని అబ్బుర పరిచాడు. హీరోకన్నా విలన్‌ను పవర్ ఫుల్‌గా ఎలివేట్ చేసి.. ఇద్దరి మధ్యా వార్‌ను ఆసక్తికరంగా మలిచాడు. దాంతో సినిమా నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. చాప్టర్ 1లో యాక్షన్‌తో పాటు కథ, అందులోని భావోద్వేగాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చిన దర్శకుడు.. చాప్టర్ 2లో మాత్రం యాక్షన్, ఎలివేషన్‌కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ, ఆ యాక్షన్, ఎలివేషన్ నెక్ట్స్ లెవెల్‌లో ఉన్నాయి. ముఖ్యంగా రాకీ భాయ్ ఇంట్రడక్షన్ సీన్.. అధీర పరిచయం.. ఇంటర్వెల్ తరవాత వచ్చే సన్నివేశాలు అదుర్స్ అనిపించాయి. కేజీయఫ్‌ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఆ సినిమాలోని విలన్లు, వారు ఎలాంటి ఎత్తులు వేస్తారు.. చివరకు ఎం జరుగుతుంది అనేది అంచనా వేస్తారు. వారి అంచనా తగ్గట్టే పార్ట్‌2 సాగుతుంది. కథలో ట్విస్టులు లేకపోయినా సినిమా మాత్రం ఓ రేంజ్ లో ఉంది.

ఫైనల్ : కెజిఎఫ్ 2 – ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్టైనర్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All