Homeటాప్ స్టోరీస్'KGF Chapter 2' మూవీ టాక్

‘KGF Chapter 2’ మూవీ టాక్

KGF 2 Movie Talk
KGF 2 Movie Talk

యశ్ – ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘KGF Chapter 2’. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మించింది. సెకండ్ పార్ట్ లో విలన్ అధీరాగా సంజయ్ దత్ నటిస్తుండగా , రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలలో నటించడం తో సినిమా ఫై మరింత అంచనాలు పెరిగాయి. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ బాషలలో ఈ సినిమా ఈరోజు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉంది…? యాష్ యాక్టింగ్ ఎలా ఉంది..? ఫస్ట్ పార్ట్ ను మించేలా ఉందా..లేదా..? అనేది పబ్లిక్ టాక్ లో చూద్దాం.

విడుదలైన అన్ని చోట్ల సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తుంది. యష్ ఎంట్రీ సీన్, ఇంటర్వెల్ సన్నివేశంతో రోమాలు నిక్కబొడుస్తాయి. కథ ఈ సినిమాకు మరింత బలంగా మారింది. బీజీఎం మరొ లెవెల్‌లో ఉంది అని అంటున్నారు. అధీరాగా సంజయ్ దత్ ఎంట్రీ అదిరిపోయింది. అతడి కెరీర్‌తోపాటు ఇండియన్ సినిమాలోనే బెస్ట్ సీన్లలో ఒకటి. ప్రశాంత్ నీల్ విజన్ బ్రిల్లియంట్. సంజయ్ దత్ టాలెంట్‌ను ప్రశాంత్ నీల్ అద్బుతంగా ఉపయోగించుకొన్నాడు. సంజయ్ దత్ తన ఫ్యాన్స్ తల ఎత్తుకొనే విధంగా సినిమా ఉంది. తుఫాన్ పాటకు బిల్డప్ అదిరిపోయింది. సినిమాలో పాట చిత్రీకరణ హై క్లాస్ రేంజ్‌లో ఉంది. మాంటేజ్ విజువల్స్ కేక పెట్టించాయి అని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా ఫస్ట్ పార్ట్ ను మించి ఉందని చెపుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All