
కెజిఎఫ్ చాప్టర్ 1 చిత్రానికి సీక్వెల్‌గా రాకింగ్ స్టార్ యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కెజిఎఫ్ 2 చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కన్నడ డబ్బింగ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం ఐదు రోజుల్లోనే అన్ని భాషల్లో కలిపి రూ.450 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వర్షం కురిపిస్తుండడం తో..ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ కావాల్సిన చిత్రాలు వాయిదా పడ్డాయి.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం `అశోక వనంలో అర్జున కల్యాణం` నాగశౌర్య హీరోగా నటించిన `కృష్ణ వ్రింద విహారి` చిత్రాలతో పాటు సుమ ప్రధాన పాత్రలో నటించిన జయమ్మ పంచాయితీ చిత్రం కూడా వచ్చే నెలకు వాయిదా పడ్డాయి. ఈ మూడు చిత్రాలని ఏప్రిల్ 22న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. ఇందు కోసం రిలీజ్ ప్లాన్ లు కూడా చేసుకున్నారు. ప్రమోషన్స్ మొదలు పెట్టారు. సడన్ గా `కేజీఎఫ్ 2` విడుదలై బ్లాక్ బస్టర్ గా మారడం.. ఇప్పటికీ థియేటర్లలో రికార్డు స్థాయిలో ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో కెజిఎఫ్ కు పోటీగా పోవడం ఇష్టం లేని నిర్మాతలు తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు.