Homeటాప్ స్టోరీస్KGF 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది

KGF 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది

KGF 2 First Review
KGF 2 First Review

యావత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం kGF 2 . ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యాష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ తాలూకా ప్రమోషన్ భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. కేజీఎఫ్ సినిమా ఎంతటి సెన్సెషన్ క్రియేట్ చేసిందో చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దానికి రెట్టింపులా ఈ సెకండ్ పార్ట్ ఉండబోతుందని తాజాగా విడుదలైన ట్రైలర్ చెప్పకనే చెపుతుంది. ఏప్రిల్ 14 న ఈ మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ రివ్యూ ఇచ్చి అభిమానుల్లో పూనకాలు తెప్పించారు యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యులు, సినీ అనలిస్ట్ ఉమైర్ సంధు.

ఒక భారీ మెసేజ్ ను ఈ సినిమా కోసం ఆయన రాసుకొచ్చాడు. కేజీఎఫ్ 2 కన్నడ సినిమాకు కీర్తి కిరీటం లాంటిది. సినిమా మొదటి నుంచి చివరి వరకు హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో నిండిపోయిందని అన్నారు. ఈ సినిమా నిండా పదునైన డైలాగ్స్ ఉన్నాయని, సంగీతం ఫర్వాలేదు కానీ అదిరిపోయే బీజీఎం దాన్ని బ్యాలెన్స్ చేసిందని చెప్పుకొచ్చారు. ఇదొక అద్భుతమైన మూవీ. సినిమా ఆద్యంతం అదే ఇంటెన్సిటీ చూపించడంలో డైరెక్టర్ పనితనం గొప్పగా ఉందని ప్రసంశలు గుప్పించాడు.

- Advertisement -

సినిమాలో నటించిన వాళ్లంతా అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఇది కేవలం కన్నడ ఇండస్ట్రీకే పరిమితమైన బ్లాక్ బ్లస్టర్ కాదు… ఇదొక వరల్డ్ క్లాస్ మూవీ. యశ్, సంజయ్ దత్ పాత్రలు అమితంగా ఆకట్టుకుంటాయని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాక క్లైమాక్స్ మిమ్మల్ని షాక్‌కి గురిచేస్తుందని మొత్తం మీద సినిమా గూస్ బంప్స్ అంతే.’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఉమైర్ సంధు తన రివ్యూ చెప్పుకొచ్చాడు. ఈ రివ్యూ తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All