Homeటాప్ స్టోరీస్కేజీఎఫ్ 2 లో నటించాలని ఉందా ?

కేజీఎఫ్ 2 లో నటించాలని ఉందా ?

కన్నడ స్టార్ హీరో యష్ నటించిన సంచలనాత్మక చిత్రం ” కేజీఎఫ్ ” చాప్టర్ 1 చిత్రానికి సీక్వెల్ గా కేజీఎఫ్ 2 త్వరలోనే రూపొందనున్న విషయం తెలిసిందే . అయితే ఆ సంచలనాత్మక చిత్రంలో నటించాలని తహతహలాడే ఔత్సాహికులకు మంచి అవకాశం కల్పిస్తున్నారు ఆ చిత్ర బృందం . 8 సంవత్సరాల నుండి 16 ఏళ్ల వరకు ఉన్న వాళ్లకు అలాగే 25 సంవత్సరాలు పైబడిన వాళ్లకు ఛాన్స్ ఇస్తున్నారు .

- Advertisement -

ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఒక నిమిషం సేపు ఏదైనా డైలాగ్ ని చెప్పి షూట్ చేసి ఆ వీడియో ని కేజీఎఫ్ చిత్ర బృందానికి పంపించడమే ! అలా పంపించిన వాళ్లలో కొంతమందిని ఆడిషన్స్ చేసి సెలక్ట్ చేస్తారు . ఇది ఔత్సాహికులకు సువర్ణావకాశం అనే చెప్పాలి . కాబట్టి నటన అంటే ఇష్టం ఉన్నవాళ్లు ట్రై చేయొచ్చు . కేజీఎఫ్ చాప్టర్ 1 రెండు వందల కోట్ల వసూళ్ల ని సాధించి ప్రభంజనం సృష్టించింది . దాంతో పెద్ద ఎత్తున పోటీదారులు రావడం ఖాయం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All