Homeటాప్ స్టోరీస్RRR ను బ్రేక్ చేసిన KGF 2

RRR ను బ్రేక్ చేసిన KGF 2

KGf 2 advance bookings crosses rrr movie bookings
KGf 2 advance bookings crosses rrr movie bookings

యావత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న kGF 2 మూవీ ఏప్రిల్ 14 న వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో విడుదల కాబోతుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యాష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ తాలూకా ట్రైలర్ రీసెంట్ గా విడుదలై ఆకట్టుకుంది. ఇక కేజీఎఫ్ పార్ట్ 1 ఎంతటి సెన్సెషన్ క్రియేట్ చేసిందో చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఈ మూవీ అటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్… హీరో యష్ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్నారు. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కింది. దీనిపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పడానికి తాజాగా ఉదాహరణే ఈ మూవీ ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్ ను బ్రేక్ చేయడం. గురువారం ఉదయం ప్రారంభమైన మల్టీప్లెక్స్‌లలో KGF 2 (హిందీ) అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే RRR (హిందీ) యొక్క పూర్తి అడ్వాన్స్‌ బుకింగ్స్ ని అతి తక్కువ సమయంలో దాటిందని అంటున్నారు. ముందుగా ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రధానంగా మల్టీప్లెక్స్‌లలో ఓపెన్ చేశారు. సింగిల్ స్క్రీన్‌లలో అడ్వాన్స్ బుకింగ్స్ వారాంతంలో లేదా సోమవారం ఓపెన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద అడ్వాన్స్ బుకింగ్ తోనే KGF 2 వార్తల్లో నిలిచింది. ఇక రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All