
యశ్ – ప్రశాంత్ నీల్ కలయికలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కెజిఫ్ 2 . భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ..ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడం తో..బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. మొదటి రోజు ఎలాగైతే వసూళ్ల వర్షం కురిపించిందో..ఆరో రోజు కూడా అదే రేంజ్ లో రాబట్టడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఆరోవ రోజు కలెక్షన్స్ చూస్తే..
నైజాంలో 1.68 కోట్లు కలెక్ట్ చేసింది. సీడెడ్‌లో ఈ చిత్రం 53 లక్షలు, ఉత్తరాంధ్రలో 26 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 26 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 18 లక్షలు, గుంటూరులో 20 లక్షలు, కృష్ణా జిల్లాలో 19 లక్షలు, నెల్లూరు జిల్లాలో 12 లక్షలు వసూలు చేసింది. దాంతో 3.51 కోట్లు షేర్, 5.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. ఇక నార్త్ లోను రూ. 19.14 కోట్లు రాబట్టి విజయయాత్ర కొనసాగిస్తోంది.