
కన్నడ మూవీ కెజిఎఫ్ 2 అన్ని భాషల్లో వసూళ్ల వర్షం కురిపిస్తుంది. విడుదలై 12 రోజులు కావొస్తున్నా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం హడావిడి ఏమాత్రం తగ్గలేదు. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా, సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, అచ్యుత్, ప్రకాష్ రాజ్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఇక 12 వ రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ చూస్తే..
నైజాంలో రూ. 64 లక్షలు
సీడెడ్‌లో రూ. 14 లక్షలు
ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు
ఈస్ట్‌లో రూ. 8 లక్షలు
వెస్ట్‌లో రూ. 5 లక్షలు
గుంటూరులో రూ. 7 లక్షలు
కృష్ణాలో రూ. 6 లక్షలు
నెల్లూరులో రూ. 4 లక్షలతో.. మొత్తం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 1.19 కోట్లు షేర్, రూ. 2.10 కోట్లు గ్రాస్ సాధించింది. మొత్తం 12 రోజుల్లో రూ. 74.51 కోట్లు షేర్, రూ. 119.70 కోట్లు గ్రాస్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 12 రోజుల్లోనే రూ. 457.73 కోట్లు వసూలు చేసింది.