
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన చిత్రం ‘KGF Chapter 2’. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్‌గా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. రవీనా టాండన్ కీలక పాత్రలో నటించారు. ఏప్రిల్ 14 న వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. ఈ భాష..ఆ భాష అనే తేడాలు లేకుండా అన్ని భాషల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.
ఇక పదోవ రోజు కలెక్షన్లు చూస్తే..
నైజాంలో రూ. 1.04 కోట్లు, సీడెడ్‌లో రూ. 34 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 21 లక్షలు, ఈస్ట్‌లో రూ. 16 లక్షలు, వెస్ట్‌లో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 14 లక్షలు, కృష్ణాలో రూ. 13 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షలతో.. 10వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 2.24 కోట్లు షేర్, రూ. 4.05 కోట్లు గ్రాస్ సాధించింది. ఈ పది రోజుల్లో మొత్తం చూస్తే రూ. 69.92 కోట్లు షేర్, రూ. 111.80 కోట్లు గ్రాస్ రాబట్టింది.