Homeఎక్స్ క్లూసివ్10 కోట్లు కొల్లగొట్టిన డబ్బింగ్ చిత్రం

10 కోట్లు కొల్లగొట్టిన డబ్బింగ్ చిత్రం

KGF 17 days collections in telugu statesకన్నడ హీరో యష్ నటించిన ” కేజీఎఫ్ ” తెలుగునాట 17 రోజుల్లో  10 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసి సంచలనం సృష్టించింది . ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో సాయి కొర్రపాటి విడుదల చేసాడు . సాయి కొర్రపాటి పలు చిత్రాలను నిర్మించాడు కానీ పెద్దగా లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు లేవు కానీ ఓ డబ్బింగ్ సినిమా అందునా కన్నడ సినిమా సాయి కొర్రపాటి ని ఆదుకుంది .

 

- Advertisement -

యష్ హీరో గా నటించగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన కేజీఎఫ్ డిసెంబర్ 21 న విడుదలైంది . తెలుగులో ఈ సినిమాతో పాటుగా ఇతర సినిమాలు కూడా విడుదల అయ్యాయి అయితే అవన్నీ పోయాయి కానీ కేజీఎఫ్ మాత్రం భారీ వసూళ్ల ని రాబడుతూ సంచలనం సృష్టిస్తోంది . రెండు తెలుగు రాష్ట్రాలలో 10 కోట్ల 28 లక్షల షేర్ ని రాబట్టడం అంటే మాటలు కాదు . దాంతో బయ్యర్లు సైతం ఆశ్చర్యానికి గురౌతున్నారట . అయితే కేజీఎఫ్ జోరు ఈరోజుతో ముగినయనుంది ఎందుకంటే రేపటి నుండి వరుసగా భారీ చిత్రాలు నాలుగు విడుదల అవుతున్నాయి కాబట్టి .

English Title: KGF 17 days collections in telugu states

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All