
తనకు నటనే రాదన్న విమర్శల్ని ఎదుర్కొన్న నటి కీర్తి సురేష్ తన అద్వితీయ మైన నటనతో `మహానటి`గా విర్శకులని మెప్పించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా పురస్కాన్ని సొంతం చేసుకున్న కీర్తి సురేష్ త్వరలో షాకింగ్ నిర్ణయం తీసుకోబోతోంది అంటూ ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ చల్ చేస్తోంది. తన పాత్ర నచ్చలేదని బాలీవుడ్ చిత్రం `మైదాన్` నుంచి తప్పుకుని షాకిచ్చిన కీర్తి సురేష్ తాజాగా మరో భారీ షాకింగ్ న్యూస్ చెప్పబోతోందని వినిపిస్తోంది.
కెరీర్ పరంగా బిజీగా వున్న కీర్తి సురేష్ త్వరలో వివాహం చేసుకోబోతున్నట్టు తెలిసింది. వరుస క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నా కీర్తి మనసు పెళ్లి వైపు మళ్లిందని, ఆమె ఫాదర్ సురేష్ కుమార్ పర్‌ఫెక్ట్ జోడీని సెలెక్ట్ చేశాడని తమిళ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఓ తమిళ పొలిటికల్ లీడర్ తనయుడు, బిజినెస్‌మేన్‌ని కీర్తి కోసం సెలెక్ట్ చేసినట్టు చెబుతున్నారు.
కెరీర్ మాంచి స్పీడులో వుండగా కీర్తి ఏంటీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటోందని తమిళ ఇండస్ట్రీలో అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి. అయితే ఈ వార్త నిజమా? లేక కావాలనే ఎవరైనా పుట్టించారా? .. ఈ వార్తల్లో నిజానిజాలు ఎంతన్నది తెలియాలంటే స్వయంగా కీర్తిసురేష్ స్పందించాల్సిందే. ప్రస్తుతం కీర్తిసురేష్ `రంగ్‌దే`, మిస్ ఇండియా, పెంగ్విన్ చిత్రాలతో పాటు తమిళ, మాలయాళ భాషల్లో క్రేజీ సినిమాలు చేస్తోంది.