Homeటాప్ స్టోరీస్దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో కీర్తి సురేశ్‌ స్పోర్ట్స్ కామెడీ చిత్రం!!

దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో కీర్తి సురేశ్‌ స్పోర్ట్స్ కామెడీ చిత్రం!!

Keerthi Suresh Aadhi Pinishetty Jagapathi Babu
Keerthi Suresh, Aadhi Pinishetty and Jagapathi Babu

`హైద‌రాబాద్ బ్లూస్‌`,`ఇక్బాల్‌` వంటి సినిమాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన బాలీవుడ్ డైరెక్ట‌ర్ న‌గేశ్ కుకునూర్‌. ఈయ‌న కీర్తి సురేశ్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్నచిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారు.

స్పోర్ట్స్ కామెడీ జోన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఆగ‌స్ట్‌లో చివ‌రి షెడ్యూల్‌ను చిత్రీక‌రించ‌నున్నారు. మంచి కంటెంట్ ఉన్న చిత్రాల‌కు స‌పోర్ట్ చేసే హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చిరంత‌న్ దాస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

- Advertisement -

న‌టీన‌టులు:
కీర్తిసురేశ్‌
ఆది పినిశెట్టి
జ‌గ‌ప‌తిబాబు
రాహుల్ రామ‌కృష్ణ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌క‌త్వం: న‌గేశ్ కుకునూర్‌
స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు(శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌)
బ్యాన‌ర్‌: వ‌ర్త్ ఏ షాట్ మోష‌న్ ఆర్ట్స్‌
నిర్మాత‌: సుధీర్ చంద్ర‌
కో ప్రొడ్యూస‌ర్‌: శ్రావ్యా వ‌ర్మ‌
మ్యూజిక్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: చిరంత‌న్ దాస్‌

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All