
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు శుక్రవారం ఉదయం కాస్త అస్వస్థతకు గురికావడం తో యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఈనేపథ్యంలోనే కేసీఆర్ వ్యక్తిగత డాక్టర్స్ ఎం వి రావు.. ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎడమ చేయి లాగుతుంది అని.. ఆయన రెండు రోజులుగా బలహీనంగా ఉన్నారని డాక్టర్ తెలిపారు. కెసిఆర్ కు ప్రస్తుతం అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారిక ప్రకటనలో తెలిపారు. స్వల్ప అస్వస్థత కు గురి కావడంతో ఆయన ఆసుపత్రికి వచ్చారే తప్ప మారే ఆరోగ్య సమస్య లేదని , నేతలు , కార్యకథలు , అభిమానులు, ప్రజలు ఖంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పి వారిలో ధైర్యం నింపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం చాలా నిలకడగా ఉందని వైద్యులు ఎంవి రావు తెలిపారు.
ప్రస్తుతం కేసీఆర్ కు ఏంజియోగ్రామ్, సిటి స్కాన్ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. కేసీఆర్ వెంట ఆయన భార్య, కూతురు కవిత, మనుమడు హిమాన్షు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ లు ఉన్నారు. ఇక అటు ఉప్పల్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్… యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. మరోపక్క ఈరోజు కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బాలాలయంలో జరిగే తిరుకల్యాణ మహోత్సవంలో కేసీఆర్ పాల్గొనాల్సి ఉండగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడం తో పర్యటన ను రద్దు చేసుకున్నారు.
ఈ క్రమంలో యాదాద్రి తిరుకల్యాణ మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను బాలాలయంలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఈవో గీతారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో రమేష్ బాబు, చైర్మన్ సతీమణి, తిరుమల అధికారులు తదితరులు పాల్గొన్నారు.