Homeటాప్ స్టోరీస్నిరుద్యోగులకు కేసీఆర్ వరాల జల్లు : 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ప్రకటన

నిరుద్యోగులకు కేసీఆర్ వరాల జల్లు : 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ప్రకటన

kcr announced on government job notification
kcr announced on government job notification

కేసీఆర్ చెప్పినట్లు నిరుద్యోగులకు వరాల జల్లుకురిపించారు. అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చింది..ఎంత కష్టపడితే వచ్చింది..విద్యార్థుల ప్రాణ త్యాగాలు ఇలా అన్నింటి గురించి గుర్తుచేస్తూ..నిరుద్యోగులకు వరాల జల్లుకురిపించారు.

రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అది కూడా ఈరోజే అని చెప్పి వారిలో ఆనందం నింపారు. రాష్ట్రంలో 11,103 మంది ఒప్పంద ఉద్యోగులున్నారు. ఏపీ ప్రభుత్వం తీరు కారణంగా రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయలేకపోతున్నామని కేసీఆర్ అసెంబ్లీ లో చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1.56 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయగా, ఇప్పటివరకు 1.33 లక్షల పోస్టులను భర్తీ చేసిందని కేసీఆర్ తెలిపారు.

- Advertisement -

దాదాపు 23,000 పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో అటెండర్ పోస్ట్ నుంచి ఆర్డీవో పోస్టు దాకా 95 శాతం ఉద్యోగాలు లోకల్ వారికే వస్తున్నాయని కేసీఆర్ ప్రకటన చేసారు.

80,039 ఉద్యోగాలను ఉన్న పళంగా భర్తీ చేస్తాం. విద్యాశాఖాలో 13, 086 పోస్టులు, హోం శాఖలో 18,334 పోస్టులు, వైద్యారోగ్యశాఖలో 12, 755 ఉద్యోగాలు, ఉన్నత విద్యాశాఖలో 7వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All