Homeటాప్ స్టోరీస్కౌముది సినిమాస్, కేన్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం.2గా హీరో సంజోష్ కొత్త చిత్రం

కౌముది సినిమాస్, కేన్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం.2గా హీరో సంజోష్ కొత్త చిత్రం

Kaumudi Cinemas, Cannes Entertainments Production No. 2 Hero Sanjosh New Movie
Kaumudi Cinemas, Cannes Entertainments Production No. 2 Hero Sanjosh New Movie

బేవర్స్ చిత్రంతో హీరోగా తెరకు పరిచయం అయ్యాడు సంజోష్. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నటించిన ఆ చిత్రంలో సంజోష్ తన నటనతో అందరినీ మెప్పించాడు. ప్రస్తుతం ఆయన కౌముది సినిమాస్, కేన్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.2గా చంద్ర నిర్మిస్తోన్న సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో సంజోష్ బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ ప్రత్యేకంగా విషెస్ చెబుతూ, పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

ఈ పోస్టర్‌లో సంజోష్ కూల్‌గా కనిపిస్తున్నాడు. పక్కింటి అబ్బాయిలా సహజంగా కనిపిస్తున్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు మేకర్లు త్వరలోనే ప్రకటించనున్నారు.

- Advertisement -

సాంకేతిక బృందం
బ్యానర్లు : కౌముది సినిమాస్, కేన్స్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : చంద్ర
దర్శకుడు : మోహన్
సంగీత దర్శకుడు : సునీల్ కశ్య.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All