Homeటాప్ స్టోరీస్2 ఏళ్ళ 11 నెలలకే 35 మిలియన్స్ – కత్రినా రికార్డ్

2 ఏళ్ళ 11 నెలలకే 35 మిలియన్స్ – కత్రినా రికార్డ్

2 ఏళ్ళ 11 నెలలకే 35 మిలియన్స్ – కత్రినా రికార్డ్
2 ఏళ్ళ 11 నెలలకే 35 మిలియన్స్ – కత్రినా రికార్డ్

బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి కత్రినా కైఫ్ మరొక అరుదైన రికార్డును తన సొంతం చేసుకుంది. కేవలం రెండు సంవత్సరాల 11 నెలల లో 35 మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్స్ రికార్డ్ సాధించింది. అదేంటి..? బాలీవుడ్ లో ఇంత మాత్రం ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్స్ లేరా..? అంటే ఉన్నారు..! కానీ వాళ్ళకి కత్రినా కు తేడా ఏంటంటే.., ఆలియా భట్ కు 35 మిలియన్ ఫాలోవర్స్ రికార్డ్ సాధించడానికి ఆరున్నర సంవత్సరాలు పట్టింది. దీపికా పదుకొనే కు 6 సంవత్సరాలు పట్టింది. అదే విధంగా ప్రియాంక చోప్రా కు శ్రద్ధాకపూర్ లకు కూడా 6 సంవత్సరాలు పట్టింది. కానీ అదే సమయంలో కత్రినాకైఫ్ కేవలం 2 సంవత్సరాల 11 నెలల లోనే ఈ ఫీట్ సాధించింది.

అంతేకాదు.. కత్రినా కైఫ్ తుర్కిష్ న్యూస్ పేపర్స్ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే ఒక హీరోయిన్. అదేవిధంగా కంబైన్డ్ ఓవర్సీస్ మార్కెట్లో 189 మిలియన్ సాధించిన ఒక అరుదైన రికార్డు కూడా ఒక పేరు మీద ఉంది. ఇక కత్రినా చేసిన సినిమాల తాలూకు దాదాపు 15 పాటలకు ఒక్కొక్కదానికి 100 మిలియన్ పైగా వ్యూస్ ఉన్నాయి. అదేవిధంగా ఆమె కెరియర్ లో 100 కోట్లు పైబడి కలెక్షన్స్ సాధించిన సినిమాలు 7. 200 కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాలు 3. బాలీవుడ్ హిస్టరీలో ట్రెండింగ్ లో ఉన్న ఆమె నటించిన పాటలనే ప్రేక్షకులు చూస్తున్నారు. ఒకప్పుడు ఆమె కు యాక్టింగ్ రాదనీ విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది కత్రినా. ఇక అధికారికంగా ఆమె త్వరలో ఒక ఇంటి మనిషి కావాలనీ, తన సొంత కుటుంబాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుందాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All