Homeటాప్ స్టోరీస్మీటూ రివర్స్ ఎఫెక్ట్ : కేసు వాపస్ తీసుకున్న భామ

మీటూ రివర్స్ ఎఫెక్ట్ : కేసు వాపస్ తీసుకున్న భామ

మీటూ రివర్స్ ఎఫెక్ట్ : కేసు వాపస్ తీసుకున్న భామ
మీటూ రివర్స్ ఎఫెక్ట్ : కేసు వాపస్ తీసుకున్న భామ

మీ టూ ఉద్యమం దేశ వ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది , అయితే ఇప్పటివరకు పలువురు భామలు రకరకాల లైంగిక ఆరోపణలు చేసారు కానీ కేసులు అయ్యింది , విచారణ జరుగుతున్నవి మాత్రం జస్ట్ వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు . ఆరోపణలు చేసినవి వందల సంఖ్యలో ఉండగా కేసులు అయ్యింది మాత్రం చుక్కల్లో చంద్రుడిగా ఒకటి అరా మాత్రమే ! దాంతో కాబోలు లేక తెరవెనుక ఏదో మతలబు జరిగి ఉండొచ్చు అందుకే ఓ హాట్ భామ కేట్ శర్మ దర్శకుడు సుభాష్ ఘాయ్ పై పెట్టిన కేసు ని ఉపసంహరించుకుంది . బాలీవుడ్ దర్శక దిగ్గజం సుభాష్ ఘాయ్ నాపట్ల అనుచితంగా ప్రవర్తించాడని సంచలన ఆరోపణలు చేసిన కేట్ శర్మ రెండు నెలల తర్వాత ఆ కేసు ని వాపస్ తీసుకుంది .

ఈ కేసు ఎందుకు వాపస్ తీసుకుందో కూడా చెబుతోంది . కేసు పెట్టాను కానీ దాంట్లో ఏమాత్రం పురోగతి లేదు పైగా మా అమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది ఈ సమయంలో నేను కేసు గురించి ఆలోచిస్తూ ఉండలేను అలాగే న్యాయం కోసం నేను ఇంకా పోరాటం చేయలేను . చెప్పాల్సిందంతా చెప్పిన తర్వాత కూడా అరెస్ట్ జరగలేదు , విచారణ లేదు అలాంటప్పుడు ఈ కేసు వల్ల ప్రయోజనం ఏంటి ? అందుకే కేసు విత్ డ్రా చేసుకున్నాను అంటూ అప్పటి ఆరోపణలకు మాత్రం ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాను అని అంటోంది కేట్ శర్మ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All