Thursday, August 11, 2022
Homeటాప్ స్టోరీస్బాడీ మసాజ్ చేయించుకొని,కౌగిలించుకొని .....

బాడీ మసాజ్ చేయించుకొని,కౌగిలించుకొని …..

kate sharma files molestation complaint against subhash ghaiబాడీ మసాజ్ చేయమంటే సుభాష్ ఘాయ్ పెద్ద దర్శకుడు కదా ! అని బాడీ మసాజ్ చేశాను దాంతో నా చేత ఒళ్ళంతా మసాజ్ చేయించుకొని గట్టిగా కౌగిలించుకున్నాడని ….. ఇదేంటి ఇలా చేస్తున్నాడు అని షాక్ నుండి తేరుకునేలోగా ముద్దు కూడా పెట్టబోయాడు దాంతో అతడి నుండి విడిపించుకొని పరుగు పరుగున బయటకు వచ్చేసానని , లేకపోతే నాపై అత్యాచారం చేసేవాడని సుభాష్ ఘాయ్ పై సంచలన ఆరోపణలు చేస్తోంది బాలీవుడ్ నటి కేట్ శర్మ . ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మీ టూ ఉద్యమం ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే . ఇప్పటికే పలువురు భామలు తమకు జరిగిన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు . ఆ కోవలోనే కేట్ శర్మ కూడా తన అనుభవాలను పంచుకుంది .

- Advertisement -

గత ఆగస్ట్ లో సుభాష్ ఘాయ్ తన ఇంటికి రావాలని కోరాడు దాంతో అతడి ఇంటికి వెళ్లాను , వెంటనే తనకు మసాజ్ చేయాలనీ కోరడంతో మొదట షాక్ అయ్యాను కానీ పెద్ద దర్శకుడు , పెద్ద వయసున్న వాడు కావడంతో గౌరవంతో ఒప్పుకున్నాను . బాడీ మసాజ్ మొత్తం అయ్యాక ఒక్కసారిగా నన్ను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టబోయాడు దాంతో నేను అతడ్ని విదిలించుకొని వచ్చానని పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేసింది కేట్ శర్మ . 73 ఏళ్ల సుభాస్ ఘాయ్ బాలీవుడ్ లో పలు సూపర్ హిట్స్ అందించాడు . కాగా ఈ వయసులో సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు .

English Title: kate sharma files molestation complaint against subhash ghai

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts