
కశ్మీర్ ఫైల్స్ ఈ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. గత నెలలో వచ్చిన ఈ మూవీ..చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయం సాధించింది. ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి 1990లలో జమ్మూకశ్మీర్‌లో తీవ్రమైన తిరుగుబాటు, అల్లరి మూకలు, కశ్మీర్ హిందువులపై దాడి ఘటనల నేపథ్యంలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీని తెరకెక్కిచారు. దీంతో ఈ సినిమాను కేంద్రం మెచ్చడం తో ప్రజలంతా ఈ సినిమాలో ఏముందా అని చూసేందుకు థియేటర్స్ కు పరుగులు పెట్టారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూ వస్తుంది.
ప్రస్తుతం ఈ చిత్రాన్ని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు ఐ యామ్ బుద్దా ప్రొడక్షన్స్ మరోసారి కలవబోతున్నారు. హ్యూమనిటీకి సంబంధించిన మరో రెండు అద్భుతమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా దీనిపై అధికారిక ప్రకటన విడుదలైంది. భారతీయ చరిత్రలో వెలుగులోకి రాని సత్యాల కోసం సిద్ధంగా ఉండండని పేర్కొంటూ ప్రకటన వీడియో వదిలారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఇకపోతే ‘ది కాశ్మీర్ ఫైల్స్’ నిర్మాతలు ఆ మధ్య ‘ది ఢిల్లీ ఫైల్స్’ అనే మరో వైవిధ్యమైన చిత్రాన్ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో జీవించే హక్కు గురించి చెప్పబోతున్నట్లు తెలిపారు. హిందీ మరియు పంజాబీ భాషలో రూపొందే ఈ చిత్రాన్ని 2022 అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు.