Homeటాప్ స్టోరీస్కరుణానిధి అస్తమయం

కరుణానిధి అస్తమయం

karunanidhi passed awayడీఎం కే అధినేత , తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (94) కొద్దిసేపటి క్రితం మరణించినట్లు కావేరీ ఆసుపత్రి డాక్టర్లు అధికారికంగా ధృవీకరించారు . జులై 27 న కరుణానిధి అస్వస్థత కు గురి కావడంతో కావేరీ ఆసుపత్రిలో చేర్పించారు . 94 ఏళ్ల వయసులో ఉన్న కరుణానిధి వయోభారం వల్ల ఊపిరి తీసుకోవడం కష్టమై పోగా , కిడ్నీ సంబంధిత వ్యాధులతో కూడా బాధపడుతున్నాడు . కాగా ఈరోజు సాయంత్రం 6: 10 నిమిషాలకు కరుణానిధి మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు . కరుణానిధి మరణవార్త తో ఒక్కసారిగా తమిళనాట హై అలర్ట్ ప్రకటించారు . ఇక డీఎం కే కార్యకర్తలు తమ నాయకుడిని తల్చుకుంటూ భోరున విలపిస్తున్నారు .

తమిళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కరుణానిధి మొత్తంగా అయిదుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు . ఎం జి ఆర్ తో పోటీపడిన కరుణానిధి ఆ తర్వాత జయలలిత తో కూడా నువ్వా – నేనా అన్నట్లుగా రాజకీయాలను సాగించారు . జాతీయ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన నాయకుడు కరుణానిధి . తమిళుల ఆరాధ్య దైవంగా ఓ వెలుగు వెలిగిన కరుణానిధి 94 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు .

- Advertisement -

English Title: karunanidhi passed away

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All