
భారీ చిత్రాలు తెరకెక్కించి చేతులు కాల్చుకుంటున్న యువీ క్రియేషన్స్ తాజాగా Rx100 ఫేమ్ కార్తికేయ తో స్మాల్ బడ్జెట్ మూవీ ప్రకటించారు. ‘Rx 100’ చిత్రంతో యూత్ లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న కార్తికేయ..ఈ మూవీ తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ ఆ రేంజ్ లో మాత్రం విజయాలు సాధించలేదు.రీసెంట్ గా అజిత్ మూవీ వలిమై లో విలన్ రోల్ చేసి మెప్పించాడు. ఇక ఇప్పుడు యువీ క్రియేషన్స్ బ్యానర్ లో ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్లో తన 08 వ చిత్రం చేయబోతున్నాడు .
”ఒక ఆసక్తికరమైన ప్రయాణం కొనసాగుతోంది! ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో టాలెంటెడ్ యాక్టర్ కార్తికేయతో మా తదుపరి చిత్రాన్ని ప్రకటిస్తున్నాము. షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉంది” అని యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అలాగే ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు. ఈ పోస్టర్ లో కార్తికేయ బ్యాక్ సైడ్ లుక్ ని చూపిస్తున్న ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. బ్యాగ్రౌండ్ లో హైదరాబాద్ నగరాన్ని కూడా చూడొచ్చు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది.