
తమిళ హీరో
కార్తీ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే . అయితే గతకొంత కాలంగా కార్తీ నటించిన చిత్రాలన్నీ ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయాయి దాంతో మార్కెట్ కూడా డల్ అయ్యింది . తాజాగా
దేవ్ చిత్రంలో నటించాడు కార్తీ . హీరోయిన్
రకుల్ ప్రీత్ సింగ్ . ఈ ఇద్దరూ కలిసి ఇంతకుముందు ఖాకీ చిత్రంలో నటించారు . అది మంచి హిట్ అయ్యింది . దాంతో దేవ్ పై అంచనాలు ఏర్పడ్డాయి . దేవ్ రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో ట్రైలర్ ని రిలీజ్ చేసారు .
అడ్వెంచర్ కోసం ఎంతవరకైనా పోరాడే తత్వం హీరోది కాగా అందుకు పూర్తిగా సెల్ఫిష్ క్యారెక్టర్ హీరోయిన్ ది . అలా రెండు భిన్న ధ్రువాలైన హీరో హీరోయిన్ లు ఎలా ప్రేమలో పడ్డారు అన్న కథే ఈ దేవ్ అనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే . కొత్త దర్శకుడు రజత్ రవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 14 న విడుదల కానుంది .
English Title: Karthi Dev trailer talk