దీపికా పడుకునే నటించిన పద్మావత్ చిత్రం విడుదలకు ముందే తీవ్ర వివాదాలను సృష్టిస్తుండగా , రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో ఏకంగా థియేటర్ లను తగులబెట్టేలా చేసింది . కర్ణిసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడమే కాకుండా థియేటర్ లను తగులబెట్టారు . మొదట ఈ సంఘటన గుజరాత్ లో జరుగగా అది వెంటనే ఇతర బిజెపి పాలిత రాష్ట్రాల్లో పాకింది . పలు థియేటర్ లు ఈ దాడిలో ద్వాంసం కాగా వందలాది ద్విచక్ర వాహనాలు బూడిద అయ్యాయి .
ఉత్తరాదిన పద్మావత్ ప్రకంపనలు మామూలుగా లేవు , కర్ణిసేన పద్మావత్ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ ఓనర్ లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది . అల్లర్లు దేశ వ్యాప్తం కావడంతో కేంద్ర బలగాలు కూడా పెద్ద ఎత్తున పద్మావత్ ప్రదర్శించనున్న థియేటర్ ల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు .