Homeగాసిప్స్రౌడీ హీరో కోసం రంగంలోకి క‌ర‌ణ్‌జోహార్!

రౌడీ హీరో కోసం రంగంలోకి క‌ర‌ణ్‌జోహార్!

రౌడీ హీరో కోసం రంగంలోకి క‌ర‌ణ్‌జోహార్!
రౌడీ హీరో కోసం రంగంలోకి క‌ర‌ణ్‌జోహార్!

`అర్జున్‌రెడ్డి` సంచ‌ల‌న విజ‌యంతో రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ హాట్ ఫేవ‌రేట్ ఆఫ్ ద టాలీవుడ్‌గా మారిపోయాడు. `అర్జున్‌రెడ్డి` త‌రువాత అత‌ను ఏ సినిమా చేసినా ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నంగా మారింది. హాండ్స‌మ్ హీరోగా వ‌రుస ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకుంటూ క్రేజీ హీరోల జాబితాలో చేరిపోయిన ఈ హీరో ప్ర‌స్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉన్నాడు. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`. రాశిఖ‌న్నా, కేథ‌రిన్‌, ఇజ‌బెల్లా ఇందులో క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.

ఇటీవ‌లే `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. టైటిల్‌కు త‌గ్గ‌ట్టే ఫ‌స్ట్ లుక్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ లుక్ వుండ‌టంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. కె.ఎస్‌. రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనితో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో చిత్రాన్ని అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. `ఇస్మార్ట్ శంక‌ర్‌` విజ‌యంతో రెట్టించిన ఉత్సాహంతో వున్న పూరి క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఫైట‌ర్‌గా చూపించ‌బోతున్నాడు. పూరితో క‌లిసి చార్మి నిర్మిస్తున్న ఈ చిత్రానికి `ఫైట‌ర్‌` అనే టైటిల్‌ని ఇప్ప‌టికే ఖ‌రారు చేశారు. అయితే విజ‌య్‌కున్న క్రేజ్ వ‌ల్ల ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోనూ మార్కెట్ చేసుకోవాల‌న్న ప్లాన్‌లో పూరి, చార్మి టీమ్ వున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -

ఇందు కోసం బాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ క‌మ్ ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్ జోహార్‌ని రంగంలోకి దించుతున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. విజ‌య్‌కున్న క్రేజ్ కార‌ణంగా `ఫైట‌ర్‌` చిత్రాన్ని `డియ‌ర్ కామ్రేడ్‌` త‌ర‌హాలో తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. బాలీవుడ్ మార్కెట్‌కు క‌ర‌ణ్ జోహార్ హెల్ప్ అవుతాడు కాబ‌ట్టి ఆయ‌న‌ని ఈ ప్రాజెక్ట్‌లో భాగ‌స్వామిని చేస్తున్న‌ట్లు తెలిసింది. ఇప్ప‌టికే క‌ర‌ణ్‌తో మీటింట్ జ‌రిపిన పూరి, చార్మి ఆయ‌నతో ఓకే చెప్పించుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి రాబోతున్న ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ బాడీతో విజ‌య్ దేవ‌ర‌కొండ ర‌చ్చ చేయ‌బోతున్నాడ‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All