
కన్నడ హీరో యాష్ నటించిన కెజిఎఫ్ 2 మూవీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కన్నడ తో పాటు పలు భాషల్లో సినిమా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ అన్ని భాషల్లో ప్రమోషన్ కార్య క్రమాలు చేపడుతూ సినిమాపై మరింత బజ్ తీసుకొస్తున్నారు. తాజాగా హీరో యాష్ ఈరోజు విశాఖపట్టణం సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయాన్ని సందర్శించారు. మొక్కుబడిలో భాగంగా ముడుపు కట్టి మొక్కు తీర్చారు.
అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. `కేజీఎఫ్ -`2 రిలీజ్ కి ముందు యశ్ ఇలా మొక్కు తీర్చడం ఆసక్తికరం. సాధారణంగా హీరోలు సినిమాలు సక్సెస్ అయిన అనంతరం మొక్కులు తీర్చడానికి తిరుపతి..వైజాగ్ తదితర దేవాలయాలకు వెళ్తుంటారు. కానీ యశ్ మాత్రం వాళ్లకి భిన్నం. సినిమా సక్సెస్ కావాలని ముందుగానే మొక్కు చెల్లించినట్లు తెలుస్తుంది.